యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రోషన్ మేక హీరోగా యువ హీరోయిన్ అనశ్వర నటించిన లేటెస్ట్ చిత్రమే “ఛాంపియన్”. ఇటీవల ట్రైలర్ లాంచ్ తో మరింత బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా నుంచి మరింత కంటెంట్ బయటకి వస్తుండగా లేటెస్ట్ గా వచ్చిన సాంగ్ చాలా మందికి షాకింగ్ గా అనిపిస్తుందని అంటున్నారు. యువ బ్యూటీ అవంతిక స్పెషల్ ప్రెజెన్స్ తో ఐయామ్ ఏ ఛాంపియన్ అంటూ సాగే ఈ డాన్స్ బీట్ సాంగ్ కి సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది.
మెయిన్ గా రోషన్ మేక ఇందులో చాలా మందిని ఆశ్చర్యపరిచాడు. ఒక పర్ఫెక్ట్ డాన్స్ నెంబర్ ని అంతే పర్ఫెక్ట్ గా పెర్ఫామ్ చేసి తనలో ఈ యాంగిల్ కూడా ఉందని చూపించడంతో తెలుగు ఆడియెన్స్ తన నుంచి మరింత ప్రిపేర్ అవుతున్నారు. ఇక ఈ సాంగ్ కి మిక్కీ వర్క్ కూడా మరింత ప్లస్ అయ్యింది. సాంగ్ సెటప్ కూడా నీట్ గా కనిపించడం మరింత ఎఫెక్టివ్ గా అనిపించింది. మొత్తానికి మాత్రం మేకర్స్ ఈ డిసెంబర్ 25న సాలిడ్ కంటెంట్ ని ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారని చెప్పాలి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


