ఆ సీరియల్‌లోకి అతిధిగా వచ్చిన ఆర్పీ పట్నాయక్..!

Published on Jul 31, 2021 1:30 am IST

బుల్లి తెరపై ఎడతెరిపి లేకుండా ప్రేక్షకులను అలరించడంలో ముఖ్య భూమిక సీరియల్స్‌దే అని చెప్పాలి. అయితే అప్పుడప్పుడు సీరియల్స్ టీఆర్పీనీ మరింత పెంచడానికి మేకర్స్ కొంత మంది సెలబ్రెటీలను అతిధులుగా ఆహ్వానిస్తుంటారు. అయితే తెలుగు సీరియల్స్‌లో ఇలాంటివి కాస్త తక్కువే కానీ హిందీ సీరియల్స్‌లో మాత్రం చాలా మంది సెలబ్రెటీలు కనిపించి వెళుతుంటారు.

అయితే హిందీలో ఎక్కువగా జరిగే ఈ గెస్ట్ అప్పియరెన్స్ హంగామా ఈ మధ్య తెలుగులో కూడా కనిపిస్తుంది. జీ తెలుగులో త్వరలో రాబోతున్న ‘ముత్యమంత ముద్దు’ అనే సరికొత్త ధారావాహిక కోసం మొన్న ఆ మధ్య ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ఆ ప్రోమోలో నటించింది. అయితే ప్రోమోలో కృతి కనిపించడంతో సీరియల్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇదే స్టాండ్‌ను కొనసాగిస్తున్న జీ తెలుగు వారు తాజాగా సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ను మరో సీరియల్ కోసం తీసుకొచ్చారు. జీ తెలుగులో సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6:30 నిమిషాలకు ప్రసారమయ్యే ‘కృష్ణ తులసీ’ సీరియల్‌కు ఆర్పీ పట్నాయక్ అతిధిగా వచ్చాడు. ఈ ఎపిసోడ్‌కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :