“RRR” ఎఫెక్ట్..ఆ బడా సినిమాల పరిస్థితి ఏంటి.?

“RRR” ఎఫెక్ట్..ఆ బడా సినిమాల పరిస్థితి ఏంటి.?

Published on May 22, 2021 8:40 PM IST

గత ఏడాది చివరి నాటికి కరోనా ఎఫెక్ట్ దేశ వ్యాప్తంగా తగ్గేసరికి మళ్ళీ చిత్ర పరిశ్రమకు ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది. దానితో ఒక్కొక్కటిగా సినిమాలు విడుదల కావడం నుంచి విడుదల కావాల్సిన సినిమాల డేట్స్ జస్ట్ రోజుల వ్యవధిలోనే కోకొల్లలుగా వచ్చి పడ్డాయి. వాటిలో ఇండియన్ వైడ్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పలు పాన్ ఇండియన్ చిత్రాలు కూడా ఉన్నాయి.

అలా అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో మళ్ళీ కరోనా పెరగడంతో అనేక సినిమాలు వాయిదా పడ్డాయి. అలా రాజమౌళి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న ఫిక్స్ చేసి ఇప్పటికీ కూడా దానికే స్టిక్ అయ్యి ఉన్నారు.

కానీ దానికి ముందు ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్న పలు భారీ చిత్రాలు ఆ నెలకు షిఫ్ట్ అయ్యాయని టాక్ వచ్చింది. ముఖ్యంగా జూలై లో ప్లాన్ చేసిన మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. “RRR” రిలీజ్ డేట్ కు కానీ దసరా రేస్ లో నిలుస్తుందని టాక్ వచ్చింది. కానీ రాధే శ్యామ్ పై క్లారిటీ లేదు గాని “పుష్ప” కూడా అక్టోబర్ కి షిఫ్ట్ అయ్యిందని ఊహాగానాలు వినిపించాయి.

అయితే వీటిపై ఎలాంటి అధికారిక క్లారిటీ లేనప్పటికీ జూలై సినిమాలు ఆన్ టైం కి ఈ టైం లో విడుదల అవుతాయని గ్యారంటీ లేదు. అలాగే RRR రిలీజ్ కి వాటితో పోలిస్తే చాలా సమయం ఉంది. సో ఫైనల్ గా మాత్రం RRR ఒక్కటి ఆన్ టైం కి స్టిక్ అయ్యి ఉంది. సో మిగతా సినిమాల ఎలాంటి ప్లానింగ్ ప్రకారం వస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు