హాట్ బజ్..”RRR” హీరోయిన్ తో మరోసారి చరణ్.!?

Published on May 23, 2021 5:00 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దీనితో పాటుగా మెగాస్టార్ తో “ఆచార్య” అనే మరో భారీ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇక ఈ రెండు చిత్రాల తర్వాత అనౌన్స్ చేసిన చిత్రంపై భారీ అంచనాలు సెట్టయ్యాయి.

శంకర్ మరియు చరణ్ ల కాంబోలో బెంచ్ మార్క్ సినిమా ఇది కావడంతో దీనిపై ఎనలేని అంచనాలు ఉన్నాయి. మరి ఈ సాలిడ్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అన్న దానిపై ఎప్పటి నుంచో క్రేజీ రూమర్స్ ఉన్నాయి.

కానీ ఇప్పుడు ఈ రేస్ లో చరణ్ సరసన ప్రస్తుతం “RRR” లో నటిస్తున్న బాలీవుడ్ టాలెంటెడ్ అండ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పేరు వచ్చినట్టు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇది వరకు ప్రముఖ హీరోయిన్ కియారా పేరు వినిపించింది మరి వీరిలో ఎవరు ఫిక్స్ అవుతారో అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం :