హిందీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన “RRR”

హిందీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన “RRR”

Published on Jul 29, 2022 8:00 PM IST

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం కి వరల్డ్ వైడ్ గా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. థియేటర్ల లో విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, డిజిటల్ ప్రీమియర్ గా విడుదల అయ్యి ప్రపంచ నలుమూలల నుండి విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది.

ఈ చిత్రం ఇప్పుడు హిందీ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్దమైంది. ఆగస్ట్ 14, 2022 న రాత్రి 8 గంటలకు జీ సినిమా లో ప్రసారం కానుంది. నార్త్ నాట ఈ చిత్రం మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. మన తెలుగు హీరోలకు అక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మరి ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకుంటుందో చూడాలి. ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించగా, శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించడం జరిగింది. ఈ భారీ బ్లాక్ బస్టర్ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు