‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్ లుక్ పై ఇంట్రస్టింగ్ న్యూస్ !

‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్ లుక్ పై ఇంట్రస్టింగ్ న్యూస్ !

Published on Feb 13, 2019 7:05 PM IST

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.

అయితే రామ్ చరణ్ ఈ సినిమాలో ఎప్పటిలాగే మాస్ లుక్ లోనే కనిపిస్తారట. లుక్ కొత్తగా లేకపోయినా చరణ్ క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ లుక్ మాత్రం ఈ సినిమాలో వైవిధ్యంగా ఉండనుంది. తన లుక్ కోసం లియోడ్ స్టీఫెన్స్ పర్యవేక్షణలో ఎన్టీఆర్ శిక్షణ కూడా తీసుకుంటున్నాడు.

ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో పైగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమా పై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు