ఆర్ఆర్ఆర్ లేటెస్ట్ అప్డేట్ !

Published on Mar 9, 2019 11:01 am IST

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ యొక్క షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక అక్కడే ప్రస్తుతం సినిమా కు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఇక ఏ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా బట్ ఒక కథానాయికగా సెలక్ట్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్ తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :