చరణ్ పై ఎవరూ ఊహించని పోస్టర్ ను రిలీజ్ చేస్తారా.!

Published on Mar 26, 2021 11:02 am IST

ఇప్పుడు మన ఇండియా లోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో ఒకటైన “RRR” నుంచి మేకర్స్ తమ అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్ పై ఒక సరికొత్త పోస్టర్ ను లాంచ్ చెయ్యడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే రేపు చరణ్ పుట్టినరోజు కాబట్టి రేపే విడుదల చేస్తారేమో అని అంతా ఆసక్తిగా ఎదురు చూసారు.

కానీ ఫైనల్ గా సంబరాలు కాస్త ముందే అని ఈరోజే ఆ పోస్టర్ ను విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ మేకర్స్ చరణ్ నుంచి ఎలాంటి లుక్ ను చూపిస్తారన్నది ఇక్కడ ముఖ్యమైన అంశం. అయితే రాజమౌళి మనకి తెలిసిన భీం మరియు సీతా రామరాజులను కాకుండా కొత్తగా పరిచయం చేస్తానని ఎప్పుడో చెప్పారు.

అందుకు తగ్గట్టుగానే అల్లూరి అంటే గుబురు గడ్డం పొడవాటి సిరోజాలకు కు వ్యతిరేఖంగా చరణ్ ను క్లీన్ షేవ్ లో అలాగే కోర మీసాలతో చూపించారు.మరి ఇప్పుడు విడుదల చేసే పోస్టర్ ఇందుకు భిన్నంగా ఉంటే బిగ్ సర్ప్రైజే అని చెప్పాలి. మరి అది కాస్తా మొదట అనుకున్న గడ్డం మరియు లాంగ్ హెయిర్ తో చూపిస్తారేమో చూడాలి.

ఎందుకంటే చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో గమనిస్తే బ్యాక్ డ్రాప్ లో నీడలా అలాంటి లుక్ నే కనిపిస్తుంది. పైగా ఆ మధ్య చరణ్ రోల్ కు మేకప్ వెయ్యడానికి రెండు గంటలు సమయం పట్టింది అని చెప్పారు. సో ఆ సిసలైన రామరాజు లుక్ ను మేకప్ తో సెట్ చేసి ఉండొచ్చు. మరి ఈ లుక్ నే మేకర్స్ రివీల్ చేస్తారా లేక వేరే ఏమన్నా వదులుతారా అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం :