మైండ్ బ్లాకింగ్..విల్లు పట్టిన నిప్పు కణిక రామరాజు వచ్చేసాడు..!

Published on Mar 26, 2021 4:16 pm IST

మెగా ఫ్యాన్స్ మరియు పాన్ ఇండియన్ లెవెల్లో “రౌద్రం రణం రుధిరం” సినిమా కోసం ఎంత గానో ఎదురు చూస్తున్న మరో బిగ్గెస్ట్ ట్రీట్ ను మేకర్స్ వదిలారు.. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు గా చేస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ది మరొక పవర్ ఫుల్ లుక్ ను రేపు చరణ్ పుట్టినరోజు సందర్భంగా ముందే చెప్పినట్టుగా ఈరోజే విడుదల చేసారు.

మొదటి నుంచీ మండే నిప్పుకి ప్రతీకగా చూపుతున్న అల్లూరి సీతారామరాజు గా చరణ్ అందరికి తెలిసిన రామ రాజు లుక్ ను విడుదల చేసారు.. బ్యాక్గ్రౌండ్ అంతా నిప్పులతో నింపేసి మధ్యలో విల్లు పట్టి గురి ఎక్కుపెట్టిన నిప్పు కణికలా సిద్ధం చేశారు.. దీనితో చరణ్ అభిమానులకు ఒక అదిరే ఫీస్ట్ తో పాటుగా.. సినిమాలో రామరాజు పాత్రను జక్కన ఏ స్థాయిలో చూపించనున్నాడో కూడా మనం అర్ధం చేసుకోవచ్చు.. మొత్తానికి మాత్రం ఈ పోస్టర్ మైండ్ బ్లాకింగ్ గా ఉందని చెప్పాలి..

సంబంధిత సమాచారం :