‘నాటు నాటు’ వీడియో సాంగ్ రిలీజ్ టైమ్ ఫిక్స్ !

Published on Apr 11, 2022 11:12 am IST

దర్శకధీరుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి భారతీయ సినీ బాక్సాఫీస్ కూడా ఆశ్చర్యపోయింది. పైగా తెలుగు చిత్రసీమలోని రెండు అగ్ర కుటుంబాల నుంచి వచ్చిన వారసులు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సినిమా ఇండస్ట్రీకి కూడా ప్రత్యేకం అయ్యింది. అయితే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ – చరణ్ కలిసి చేసిన ‘నాటు నాటు’ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

కాగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ క్రేజీ సాంగ్ మాస్ యాంథమ్ వీడియో సాంగ్ రిలీజ్ కాబోతుంది. ఈ సాంగ్ సినిమా పై అంచనాలను పెంచడంతో పాటు అభిమానులను సైతం బాగా ఆకట్టుకుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ పాటను రీక్రియేట్‌ చేస్తూ స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ రాబోతుందనే సరికి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

సంబంధిత సమాచారం :