‘ఆర్ఆర్ఆర్’ మరోసారి వాయిదా పడేనా ?

Published on May 1, 2021 3:00 am IST

తెలుగు సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ భారత సినీ అభిమానులు ఎంతో ఆసక్తిని పెంచుకున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబలి 2’ తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడం, రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ నిలిచిపోవడంతో సినిమా విడుదల కూడ చాలా వెనక్కు వెళ్లింది. అక్టోబర్ 13న సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కానీ పరిస్థితులు చూస్తే ఈ ఏడాది రిలీజ్ సాధ్యమేనా అనే అనుమానం కలుగుతోంది.

సినిమా చిత్రీకరణ ఇంకొంత మిగిలే ఉంది. సెకండ్ వేవ్ కారణంగా అది కాస్తా ఆలస్యం అయ్యేలా ఉంది. బయట చూస్తే కరోనా విలయతాండవం ఇప్పుడప్పుడే అదుపులోకి వచ్చేలా లేదు. అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి కేసులు కంట్రోల్ కావడానికి, ప్రేక్షకులు ధైర్యం చేసి థియేటర్లకు రావడానికి ఇంకో నాలుగు నెలలు సమయం పట్టేలా ఉంది. ఈలోపు సినిమా విడుదల అంటే కష్టమే. ఎందుకంటే 50 శాతం అక్యుపెన్సీలో రీలీజ్ చేసే సినిమా కాదు ‘ఆర్ఆర్ఆర్’. ఎలాంటి భయాందోళనలు లేకుండా పూర్తిస్థాయి ఆరోగ్యకరమైన వాతావరణంలో రావాల్సిన చిత్రం. అలాంటి పరిస్థితి రావాలంటే కొద్దిగా సమయం పట్టేలా ఉంది. ఉత్తరాదిలో సిట్యుయేషన్ ఎప్పటికి కంట్రోల్ అవుతుందో తెలియట్లేదు. కాబట్టి సినిమా మరోసారి వాయిదా పడక తప్పేలా లేదని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

సంబంధిత సమాచారం :