“ఆర్ఆర్ఆర్”లో “మల్లి” పాత్రలో నటించిన చిన్నారి ఎవరంటే?

Published on Mar 29, 2022 10:06 pm IST

జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్లుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం “ఆర్‌ఆర్‌ఆర్‌”. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల పర్ఫార్మెన్స్‌కు పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరితో పాటు సినిమాలో “మల్లి” అనే పాత్ర చేసిన చిన్నారి పర్ఫార్మెన్స్‌కు కూడా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయినట్టు తెలుస్తుంది. దీంతో ఇంతకీ ఆ చిన్నారి ఎవరు అనేదాని గురుంచి ప్రస్తుతం నెటిజన్లు చర్చించుకుంటున్నారట.

అయితే ఆర్ఆర్ఆర్‌లో మల్లి పాత్ర పోషించిన చిన్నారి పేరు పేరు ట్వింకిల్‌ శర్మ. ఛండీగర్ రాష్ట్రానికి చెందిన ఈ చిన్నారి డాన్స్‌ ఇండియా డాన్స్‌ రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు పలు టీవీ యాడ్స్‌లో కూడా నటించింది. అయితే ఫ్లిప్‌ కార్ట్‌ యాడ్‌లో ఈ చిన్నారిని చూసిన రాజమౌళి ఆడిషన్‌కు పిలిపించి మల్లి పాత్రకు సెలక్ట్‌ చేశారట. ఈ చిత్రంలో ‘నన్ను ఈడ ఇడిసిపోకన్న.. అమ్మ యాదికొస్తాంది’ అంటూ మల్లీ చెప్పే డైలాగ్‌ గుండెల్ని పిండేసేలా ఉంటుంది. ఇదిలా ఉంటే గిరిజన బిడ్డైన మల్లిని బ్రిటిష్ దొరసాని తీసుకెళ్లడంతో ఆర్ఆర్ఆర్ సినిమా స్టోరీ మొదలవుతుంది.

సంబంధిత సమాచారం :