లేటెస్ట్..”RRR” హిస్టారికల్ టీజర్ కట్ రెడీ అవుతుందా.?

Published on Jul 10, 2021 7:04 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ విజువల్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఎనలేని అంచనాలు నెలకొల్పుకున్నా ఈ సినిమా కోసం పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఇప్పుడు షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉన్న ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు కొమరం భీం టీజర్ చూసాం.. అల్లూరి సీతా రామరాజు టీజర్ కూడా చూసాం.. కానీ ఇద్దరినీ కలిపి ఒకే టీజర్ లో ఎప్పుడు చూస్తామా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఆ ఘడియలు బహుశా దగ్గరే ఉన్నాయేమో అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వచ్చే ఆగష్టు 15 న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వచ్చే అవకాశం ఉందేమో అని తెలుస్తుంది. ఎలాగో సినిమా అప్పటికి కంప్లీట్ అయ్యిపోతుంది. మరి రాజమౌళి కూడా ఎలాగో అక్టోబర్ రిలీజ్ కే సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆగష్టు 15 నాటికి ఈ హిస్టారికల్ ట్రీట్ ని ఆశించడంలో ఎలాంటి పొరపాటు లేదు. మరి ఈ బిగ్గెస్ట్ టీజర్ ఫీస్ట్ అప్పుడు ఉంటుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :