లాస్ ఏంజిల్స్ టైమ్స్ 2022 బెస్ట్ మూవీస్ లో “RRR”

లాస్ ఏంజిల్స్ టైమ్స్ 2022 బెస్ట్ మూవీస్ లో “RRR”

Published on Jun 30, 2022 1:00 PM IST


దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో భారీగా విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం ఆన్లైన్ లో నెట్ ఫ్లిక్స్ ద్వారా మరింత రీచ్ ను సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా, హాలీవుడ్ సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు దక్కించుకుంటుంది. ఈ చిత్రం ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది.

లాస్ ఏంజిల్స్ టైమ్స్ బెస్ట్ మూవీస్ 2022 లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఆర్ ఆర్ ఆర్ ను చేర్చడం జరిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు అల్లూరి సీతారామరాజు, కోమురం భీమ్ పాత్రల్లో నటించగా, ఒలివియా మోరిస్, అలియా భట్ లు హీరోయిన్స్ గా నటించారు. శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు