‘ఆర్ఆర్ఆర్’లోనే ‘చరణ్’ ఫైట్స్ ప్రత్యేకంగా నిలుస్తాయట !

Published on Mar 11, 2019 11:27 pm IST

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఇప్పటికే జరిగిన షెడ్యూల్స్ లో రామ్ చరణ్ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన సీన్స్ ను తీసారు. రఫ్ ఎడిటింగ్ చేసిన తరువాత ఆ సీన్స్ ను చూసిన చిత్రబృందం.. అవుట్ ఫుట్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఆ యాక్షన్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఫైట్స్ హైలెట్ గా ఉన్నాయట. సినిమాకే చెర్రీ ఫైట్స్ ప్రత్యేకంగా నిలుస్తాయట. పైగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More