ఎన్టీఆర్ కోసం.. రాజమౌళి !

ఎన్టీఆర్ కోసం.. రాజమౌళి !

Published on Apr 13, 2019 2:31 PM IST

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ రామ్ చరణ్ కు గాయం అవ్వడం కారణంగా మూడు వారాల పాటు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ కొన్ని పర్సనల్ ప్రొబ్లెమ్స్ వల్ల ఈ సినిమా నుండి తప్పుకున్న విషయం కూడా తెలిసిందే.

కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ కోసం హీరోయిన్ని వెతికే పనిలో ఉన్నాడట రాజమౌళి. త్వరలో ఓ హీరోయిన్ని ఫైనల్ చేస్తాడట. అయితే ఈ సినిమాలో నిత్యా మీనన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతొంది. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం నిత్యా మీనన్ ఎన్టీఆర్ సరసన సెకెండ్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పటికే ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ ‘ఆర్ఆర్ఆర్’లో ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు