‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ కు బాబాయ్ గా.. !

Published on May 1, 2019 4:10 pm IST

రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం సముద్రఖని ఎన్టీఆర్ బాబాయ్ గా నటిస్తున్నాడట. అంటే కొమురం భీమ్ కు బాబాయ్ గా అన్నమాట. వాస్తవానికి కొమురం భీమ్ లో విప్లవాత్మక భావాలను కలిగించింది అయన బాబాయే అని చరిత్ర చెబుతుంది. ఇప్పుడు ఆ పాత్రలో సముద్రఖని ఎలా నటిస్తారో చూడాలి.

కాగా రామ్ చరణ్ కు గాయం అవ్వడం కారణంగా మూడు వారాల పాటు షూటింగ్ కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అయితే ‘మే’ ఒకటి రెండు తారీఖుల్లో షూటింగ్ ప్రారంభమంతుందని అందరూ భావించారు కానీ, షూటింగ్ మొదలు అవ్వడానికి మరో వారం రోజులు పడుతుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇద్దరూ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికీ మొదటి హీరోయిన్ కోసం వెతికే పనిలో ఉన్నాడు రాజమౌళి. అయితే రెండో హీరోయిన్ గా నిత్యా మీనన్ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More