భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న “RRR” రోర్.!

Published on Jul 16, 2021 10:02 am IST


ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి వస్తున్న పలు భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో ముందు వరుసలో ఉండేది “రౌద్రం రణం రుధిరం” ఇనిమనే అని చెప్పాలి. మెగాపవర్ స్టార్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు నిన్నటి నుంచి మరో స్థాయికి వెళ్లాయి.

సాలిడ్ హైప్ తో మేకర్స్ ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోని విడుదల చెయ్యగా దానికి భారీ రెస్పాన్స్ మొదటి నిమిషం నుంచి తెచ్చుకోగలిగింది. వదిలిన గంటల వ్యవధిలోనే యూట్యూబ్ నెంబర్ 1 స్థానంలోకి ట్రెండింగ్ వచ్చేయగా ఇప్పుడు ఇంకా 24 గంటలు పూర్తి కాకముందే 6 మిలియన్ కి పైగా వ్యూస్ రాబట్టేసి దూసుకెళ్తుంది.

ఒక మేకింగ్ వీడియోకి ఇంత తక్కువ టైం లో ఇంత రెస్పాన్స్ మామూలు విషయం కాదని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రంలో ఆలియా భట్, అజయ్ దేవగన్ అలాగే సముథిరఖని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి కీరవాణి అవుట్ స్టాండింగ్ సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :