లేటెస్ట్..జపాన్లో ఆగని “RRR” సెన్సేషన్.!

లేటెస్ట్..జపాన్లో ఆగని “RRR” సెన్సేషన్.!

Published on Apr 25, 2023 11:00 AM IST

rrr 2

గ్లోబల్ స్టార్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన మాసివ్ గ్లోబల్ హిట్ సినిమా “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. గ్లోబల్ గా భారీ హిట్ అయ్యిన ఈ సినిమా ఆస్కార్ అవార్డు కూడా గెలుపొంది తెలుగు సినిమా సహా ఇండియన్ సినిమాకి గర్వకారణంగా నిలిచింది. అయితే ఈ సినిమా మాసివ్ రన్ జపాన్ దేశంలో ఇప్పటికీ కొనసాగుతుంది.

వసూళ్లు థియేట్రికల్ రన్ లో కూడా అనేక రికార్డులు నెలకొల్పిన ఈ చిత్రం ఇప్పుడు 200 రోజులు దగ్గరకి వస్తున్నా కూడా అక్కడ టికెట్ బుకింగ్స్ లో ఇంకా టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా నిలిచి కొనసాగుతూ ఉండడం విశేషం. అంటే ఈ లెక్కన జపాన్ దేశంలో RRR కి అందిన ఆదరణ ఎంత పెద్దదో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. అలాగే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు