RRR ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్?

RRR ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్?

Published on Mar 30, 2022 3:01 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా జనాల దృష్టిని బాగా ఆకర్షించింది. వారం రోజులుగా ఈ సినిమా బిజినెస్ చేస్తున్న తీరు చూస్తే సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది. జీ 5 మరియు నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రం యొక్క స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేశాయి.

తాజా సమాచారం ప్రకారం, చిత్రం విడుదలైన 2 నెలల తర్వాత మే 25న రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎటువంటి నిర్ధారణ లేనప్పటికీ, ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వార్తల ప్రకారం హిందీ వెర్షన్ మరియు సౌత్ వెర్షన్‌లు వేర్వేరు విడుదల సమయాలను కలిగి ఉంటాయి. అలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించగా, డివివి దానయ్య భారీ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు