“RRR” బ్యానర్ తో అక్కడ “పుష్ప” భారీ రిలీజ్.!

Published on Nov 18, 2021 7:04 am IST


ప్రస్తుతం పాన్ ఇండియన్ వైడ్ రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రాల్లో మన సౌత్ ఇండియన్ సినిమా నుంచి రాబోతున్నవే ఎక్కువగా ఉన్నాయి. మరి వాటిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తీసిన సినిమా “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. మరి అలాగే దీని కన్నా ముందు టాలీవుడ్ నుంచి ఈ ఏడాది ఫస్ట్ పాన్ ఇండియా మార్కెట్ ని తెరవబోతుంది మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప” సినిమానే.

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు తో తెరక్కింది. మరి ఈ సినిమాని తమిళ్ లో RRR సినిమాని అత్యంత గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నటువంటి బడా బ్యానర్ లైకా వారు రిలీజ్ చెయ్యనున్నారట. సో పుష్ప కూడా తమిళ నాట భారీ రిలీజ్ ఖాయం అని చెప్పాలి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా తెరకెక్కుతుంది. అలాగే ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ వచ్చే డిసెంబరు 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :