వైరల్ అవుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ లొకేషన్ వీడియో !

Published on Apr 2, 2019 7:48 pm IST

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం గుజరాత్ లోని వడోదరలో శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. నెలరోజుల పాటు అక్కడే షూటింగ్ జరగనుంది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ లొకేషన్ కి సంబంధించిన ఓ చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్దరూ ఒకే స్కూటర్ పై ప్రయాణిస్తూ కనిపించారు. ముందుగా రామ్ చరణ్ స్కూటీని తీసుకోని ఎన్టీఆర్ ఉన్న క్యారీ వ్యాన్ దగ్గరికి రాగా, దాంతో క్యారీ వ్యాన్ లో నుండి ఎన్టీఆర్ దిగి స్కూటీని డ్రైవ్ చేశాడు. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు ఎన్టీఆర్ – చరణ్ అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది.

ఇక ఈ సినిమాలోని ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. హీరోయిన్ల విషయానికే వస్తే చరణ్ కి జోడిగా అలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ లను నటిస్తున్న సంగతి తెలిసిందే.

అజయ్ దేవగణ్ ‘ఆర్ఆర్ఆర్’లో ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :