చెన్నై టీం కి “RRR” టీం రిప్లై దేనికో చూడండి.!

Published on Sep 8, 2021 8:00 am IST


మన దేశంలో సినిమాలతో పాటుగా ప్రేక్షకులు ఎంతో ఆదరించే వేరే అంశం ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా క్రికెట్ అనే చెప్పాలి. మరి అందులో ఐపీఎల్ కి అయితే ఉన్న క్రేజ్ వేరే.. ఈ ఐపీఎల్ లో చెన్నై టీం కి ఉన్న ఫాలోయింగ్ కూడా వేరే ఏ ఇతర టీం కి కూడా లేదని తెలిసిందే.. మరి ఈ చెన్నై టీం వారు లేటెస్ట్ గా పెట్టిన ఓ ట్వీట్ ఇంట్రెస్టింగ్ గా మారింది..

తమ టీం లోని ముగ్గురు ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, రైనా లు కలిసి ఉన్న ఒక పిక్ పెట్టి వీరే మా “RRR” అంటూ క్రేజీ ట్వీట్ పెట్టారు. మరి దీనికి ‘RRR’ టీం రిప్లై ఇస్తూ మేము కూడా ఈ ముగ్గురు ‘ఆర్’ ల ఆటని చూడటానికి విజిల్ పట్టి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నామని రిప్లై ఇచ్చారు. దీనితో ఈ రెండు పవర్ ఫుల్ టీమ్స్ మధ్య కన్వర్జేషన్ వైరల్ అవుతుంది. మరి ఐపీఎల్ మళ్ళీ ఈ సెప్టెంబర్ 19 నుంచి రీస్టార్ట్ కానుండగా “RRR” చిత్రం వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యినట్టుగా తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :