“RRR” కొత్త రిలీజ్ డేట్ కూడా అప్పుడా..?

“RRR” కొత్త రిలీజ్ డేట్ కూడా అప్పుడా..?

Published on May 11, 2021 1:00 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి “రౌద్రం రణం రుధిరం” అనే భారీ బడ్జెట్ చిత్రం దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం నుంచో ఒక్కో స్పెషల్ డే కు ఒక్కో సాలిడ్ అప్డేట్ ను మేకర్స్ వదులుతున్నారు. ఇప్పటికే చరణ్ మరియు అజయ్ దేవగణ్ ల పుట్టినరోజుకి గాను అదిరే పోస్టర్స్ కూడా వదిలారు.

ఇక మిగిలి ఉంది తారక్ పుట్టినరోజు కావడంతో ఆరోజు కూడా సూపర్ స్పెషల్ పోస్టర్ సన్నద్ధం అవుతుంది. మరి ఇదే పోస్టర్ తో పాటుగా ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం తాలూకా రిలీజ్ డేట్ కూడా రివీల్ కానుంది అని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే పరిస్థితులు ఊహించని విధంగా మారుతుండడంతో రిలీజ్ అక్టోబర్ నుంచి షిఫ్ట్ అవ్వొచ్చని టాక్ ఉంది. మరి ఆ సరికొత్త తేదీ తారక్ పుట్టినరోజునే వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు