తారక్ పుట్టినరోజునాడు ఒక క్లారిటీ వస్తుందేమో ?

Published on May 18, 2021 3:00 am IST

జూ.ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ప్యాన్‌ ఇండియా సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల విషయంలో కొత్త సస్పెన్స్ మొదలైంది. ఇప్పటికే పలుమార్లు వాయిదాపడిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 13న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో ‘ఆర్ఆర్ఆర్’ ఆలస్యమయ్యేలా ఉంది. ఇంకా నెలన్నర రోజులపాటు షూటింగ్ మిగిలే ఉంది. లాక్ డౌన్ ముగిసి షూటింగ్స్ మొదలుకావడానికి ఇంకో రెండు నెలల సమయం పట్టేలా ఉంది. అప్పుడు షూట్ రీస్టార్ట్ చేసినా అక్టోబర్ నాటికి పూర్తికావడం అసాధ్యం.

ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా టైమ్ పడుతుంది. సో.. 2021కి సినిమా దాదాపుగా లేనట్టే. మరి కొత్త రిలీజ్ డేట్ ఏంటి అనే ప్రశ్నకు రెండు సమాధానాలు వినిపిస్తున్నాయి. అందులో ఇకటి 2022 సంక్రాంతి కాగా ఇంకొకటి 2022 సమ్మర్. సంక్రాంతికి సినిమా అంటే చాలా పోటీ ఉంటుంది. బరిలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల సినిమాలు తప్పకుండా ఉంటాయి. అవి కాకుండా ఇంకో రెండు పెద్ద సినిమాలు వచ్చి చేరే వీలుంది. అలాగని వేసవికి వెళితే ఇంకా ఆలస్యమవుతుంది. మరి ఈ సందేహానికి సమాధానం ఎప్పుడు దొరుకుతుంది అంటే ఈ నెల 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం రిలీజ్ చేసే పోస్టర్లో రివీల్ కావొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. మరి జక్కన్న టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చూడాలి.

సంబంధిత సమాచారం :