ఆర్ ఆర్ ఆర్ ప్రెస్ మీట్ హైలైట్స్ !
Published on Mar 14, 2019 12:05 pm IST

మచ్ అవైటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ గురించి ప్రెస్ మీట్ లో ఆసక్తికర విషయాలను వెల్లడించారు డైరెక్టర్ రాజమౌళి. ముందుగా ఆయన మాట్లాడుతూ స్టోరీ ప్లాట్ ను రివీల్ చేశారుస్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను బేస్ చేసుకొని తెరకెక్కుతుంది ఈ చిత్రం.

ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్ అలాగే కొమురం భీం గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్ , సముద్రఖని నటిస్తున్నారు. ఇక హీరోయిన్ల విషయానికే వస్తే ఈ చిత్రంలో చరణ్ జోడిగా అలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ లను ఖరారు చేశాం.

ఇక హై టెక్నికల్ వాల్యూస్ తో 350 కోట్ల నుండి 400కోట్ల తో ఈ సినిమాను నిర్మిస్తున్నామని నిర్మాత దానయ్య డివివి వెల్లడించారు.

  • 6
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook