బిగ్ అప్డేట్..”RRR” బ్యాలన్స్ షూట్ పై క్లారిటీ.!

Published on Jun 16, 2021 12:00 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం ఇండియన్ ఆడియెన్స్ ఎలా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. మరి ఆల్ మోస్ట్ సూటి కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఇంకా కొంత మేర షూటింగ్ ను బ్యాలన్స్ ఉంచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ మిగిలి ఉన్న బ్యాలన్స్ పోర్షన్ ఏమిటి అన్నది ఇంకా సరైన క్లారిటీ లేదు.

కానీ దానిపై ఈ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. లేటెస్ట్ గా వచ్చిన ప్రింట్ మీడియా ఆధారంగా ఈ చిత్రంలో ఇంకా కేవలం రెండు పాటలు తాలూకా షూట్ మాత్రమే బ్యాలన్స్ ఉందని అవి పూర్తయితే ఈ షూట్ పూర్తవుతుంది అని తెలిపారు. సో ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి. అలాగే ఈ భారీ చిత్రం షూట్ కూడా ఈ జూన్ నెలాఖరు నుంచే స్టార్ట్ చేస్తున్నట్టుగా మరో క్లారిటీ కూడా ఇచ్చారు.

సంబంధిత సమాచారం :