ఆర్ఆర్ఆర్ బృందానికి చరణ్ బంగారం కాయిన్ కానుక !

Published on Apr 3, 2022 9:09 pm IST

ఆర్ఆర్ఆర్ మేనియా ప్రస్తుతం ఏ రేంజ్‌లో ఉందో తెలిసిందే. రాజమౌళి మెస్మరైజింగ్‌ మ్యాజిక్‌తో మరోసారి ఇండస్ట్రీ హిట్‌ కొట్టాడు. ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన నటనతో అబ్బురపరిచాడు. అయితే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మంచి తనాన్ని చాటుకున్నారు. సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన హెచ్ఓడీలను ఈ ఉదయం అల్పాహారం కోసం పిలిపించి వారందరికీ ఊహించని బహుమతి అందించారు.

సినిమా కోసం పని చేసిన వివిధ విభాగాల అధిపతులను, కెమెరా అసిస్టెంట్లను, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్లను, మేనేజర్లను, అకౌంటెంట్లను, స్టిల్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్లను ఇలా దాదాపు అన్ని విభాగాలకు చెందిన సుమారు 35 మందిని ఇంటికి అల్పాహారం కోసం పిలిపించారు. అలాగే వారితో కాస్త సమయం కూడా రామ్ చరణ్ గడిపారు.

ఇక అనంతరం వారందరికీ ఒక్కొకరికి ఒక్కో తులం బంగారం కాయిన్ కానుకగా ఇవ్వడమే కాక వారికి ఒక కేజీ స్వీట్ బాక్స్ కూడా అందించి సినిమా కోసం పని చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా ఇంత అద్భుతంగా రావడంలో వారి పాత్ర కూడా ఉందని ఈ సందర్భంగా రామ్ చరణ్ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత సమాచారం :