ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్డేట్ !

Published on Mar 31, 2019 3:37 pm IST

టాలీవుడ్ బిగెస్ట్ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఇటీవల హైదరాబాద్ లో బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రం యొక్క తదుపరి షూటింగ్ ఎక్కువ భాగం నార్త్ ఇండియాలో జరుగనుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ చిత్రం యొక్క మూడవ షెడ్యూల్ అహమ్మదాబాద్ లోని కొండల్లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ , చరణ్ లఫై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ షెడ్యూల్ తరువాత ఢిల్లీ , రాజస్థాన్ ల్లో షూటింగ్ జరుపుకోనుంది ఈ చిత్రం. ఢిల్లీ షెడ్యూల్ లో హీరోయిన్ అలియా భట్ జాయిన్ కానుంది.

పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చరణ్ కు జోడిగా అలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా డైసీ నటించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఎలాగైనా అనుకున్న తేదీ కి విడుదలచేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

భారీ బడ్జెట్ తో దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30 న ఈ సినిమా సౌత్ తో పాటు నార్త్ లో కూడా భారీ స్థాయిలో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More