‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కానుందంటే !

Published on Jul 7, 2018 3:54 pm IST

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్ర షూటింగ్ ప్రారంభం గురించి గత కొద్దీ రోజులు గా రక రకాల వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కావడం ఖాయమైంది. మొదటగా ఎన్టీఆర్ , చరణ్ లపై సోలో సీన్స్ తెరకెక్కించి తరువాత వారి ఇద్దరి కలయికలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు . ప్రస్తుతం ఈ చిత్రానికి ఈ చిత్రం కోసం భారీ సెట్టింగ్స్ ను నిర్మిస్తున్నారు. డి వి వి ఎంటెర్టైన్మ్నెట్స్ పతాకం ఫై దానయ్య డి వి వి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ చిత్ర షూటింగ్ లో పాల్గొంటుండగా, రామ్ చరణ్ బోయపాటి తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. వీరిద్దరూ ఈ చిత్రాలను పూర్తి చేసిన తరువాత రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు.

సంబంధిత సమాచారం :