అలర్ట్ అంటున్న “RRR” దేని కోసమో మరి.!

Published on Apr 1, 2021 10:07 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలిసిందే. మరి రేపు బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్ గణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ సాలిడ్ అప్డేట్ కూడా రానుంది.

కానీ ఇప్పుడు ఏదో అలెర్ట్ అంటూ పోస్ట్ చేసారు. అది చూస్తే కాస్త వాళ్ళ సినిమాలో చరణ్ మరియు తారక్ లు చేస్తున్న రోల్స్ ను ప్రెజెంట్ చేస్తూ ప్రస్తుత వేసవికి రిలేటెడ్ గా ఉంది కానీ కేవలం దాని కోసమేనా లేక మరేమన్నా ఉందా అన్న కన్ఫ్యూజన్ ఫాలోవర్స్ లో మొదలయ్యింది. మరి ఈ అలర్ట్ దేని కోసమో వారికే తెలియాలి.

ఇక ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటి ఆలియా భట్ మరియు కోలీవుడ్ టాలెంటెడ్ నటుడు సముథ్రఖని తదితర అగ్ర తారాగణం నటిస్తున్నారు. మరి అలాగే ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వచ్చే అక్టోబర్ 13న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :