తారక్, చరణ్ లపై మాసివ్ క్లైమాక్స్ సన్నివేశంలో “RRR”.!

Published on Jan 19, 2021 5:00 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు స్వాతంత్ర సమారా వీరులు కొమరం భీం మరియు అల్లూరి సీతారామరాజులుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ వండర్ “రౌద్రం రణం రుధిరం”. అసలు ఊహలకు అందని కాంబోను మరియు సబ్జెక్టును రాజమౌళి ప్లాన్ చెయ్యడంతో తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

మరి అంతే అంచనాలకు తగ్గట్టుగా రాజమౌళి ఈ సినిమాను పక్కా పవర్ ఫుల్ గా తెరకెక్కిస్తున్నారు. అలాగే షూట్ కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ లను ఇస్తున్నారు. మరి అలాగే ఇప్పుడు ఈ సినిమాలోని మాసివ్ క్లైమాక్స్ సీన్ కు రంగం సిద్ధం చేసినట్టుగా “RRR” టీం తెలిపారు.

ఇందులో తమ భీం ఎన్టీఆర్, అల్లూరి చరణ్ లు కలిసి ఉండే అదిరిపోయే బ్లాక్ ను అన్నట్టుగా ఇద్దరి చేతులు కలిపి చూపించారు. టైటిల్ పోస్టర్ లో హైలైట్ చేసినట్టుగా అదే పోస్టర్ తో దీనిని వదిలారు. మరి ఈ భీకర పోరాట సన్నివేశంలో ఈ ఇద్దరు యోధులు ఏం సాధించారో అన్నది థియేటర్స్ లోనే చూడాలి.

సంబంధిత సమాచారం :