భీం ఎంట్రీకి టైం ఫిక్స్ చేసిన “RRR” టీం.!

Published on May 19, 2021 5:00 pm IST

రేపు మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తారక్ అభిమానులు అంతా సోషల్ మీడియాలో ఆల్రెడీ హంగామా మొదలు పెట్టేసారు. మరి ఈ సమయంలోనే తారక్ నటిస్తున్న లేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” నుంచి తాను చేస్తున్న కొమరం భీం సరికొత్త పోస్టర్ కోసం అయితే మరో స్థాయిలో ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ ఎట్టకేలకు మేకర్స్ ఆ టైం ను వెల్లడించారు. ఈ మోస్ట్ అవైటెడ్ భీం ఇంటెన్స్ పోస్టర్ ను రేపు మే 20 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు. సో ఫైనల్ గా తారక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నిరీక్షణకు తెర పడింది. మరి రాజమౌళి అప్పుడు చరణ్ నుంచి సీతారామరాజుగా ఊహించని మేకోవర్ లుక్ ను చూపించారు. మరి ఈసారి భీం గా ఎన్టీఆర్ ను ఎలాంటి అవతార్ లో చూపిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :