చరణ్ కు గ్రాండ్ సర్ప్రైజ్ నే ఇచ్చిన “RRR” టీం.!

Published on Mar 27, 2021 4:00 pm IST

నేడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా అటు సోషల్ మీడియాలో ఒకపక్క బయట సంబరాలు ఓ రేంజ్ లో చేస్తున్నారు. అలాగే మిగతా సినీ నటులు కూడా చరణ్ కు తమ శుభాకాంక్షలు తెలియజేసారు. మరి దీనితో పాటుగా తాను నటిస్తున్న భారీ చిత్రాలు నుంచి సాలిడ్ గిఫ్టులు కూడా అభిమానులకు వారు ఇచ్చేసారు.

అయితే తాను చేస్తున్న బడా మల్టీ స్టారర్ చిత్రం “RRR” యూనిట్ ఇచ్చింది అమోఘం అని చెప్పాలి. సీతారామరాజుగా విడుదల చేసిన పోస్టర్ తో రౌద్రం రణం రుధిరం యూనిట్ కాక రేపారు. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు లేటెస్ట్ గా ఓ వీడియోను వదిలారు. తమ చిత్ర షూటింగ్ సెట్స్ లో చరణ్ కు భారీ సర్ప్రైజ్ నే ప్లాన్ చేసి స్టన్ చేశారు.

పెద్ద హోర్డింగ్ ను గాల్లోకి లేపి దానిపై చరణ్ కు బర్త్ డే విషెష్ రాసి పెట్టి గాల్లో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి అదరగొట్టారు. దీనితో ఈ ఊహించని గిఫ్ట్ ని చూసి చరణ్ ఎంతో ఆనందం ఫీల్ అయ్యాడు. ఫైనల్ గా కేక్ కట్ చేయింది రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్యలు సహా మిగతా టీం అంతా చరణ్ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు.

సంబంధిత సమాచారం :