కరోనా టెన్షన్ లో “ఆర్ఆర్ఆర్” టీమ్ !

Published on May 1, 2021 7:09 pm IST

దర్శక ధీరుడు రాజమౌళిని కరోనా టెన్షన్ పెడుతూనే ఉంది. వందల కోట్ల రూపాయిల మార్కెట్ ఉన్న “ఆర్ఆర్ఆర్” సినిమా ఇప్పటికే లేట్ అయింది. ఇప్పటికే అనుకున్న షూట్ డేట్స్ అన్ని దాటిపోయాయి. మరోపక్క ప్రస్తుతం షూటింగ్ చేసే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. మరి ఈ లెక్కన ఈ సినిమా షూటింగ్ ను ఇక ఎప్పుడు పూర్తి చెయ్యాలి ? అన్నిటికి మించి సినిమా రిలీజ్ డేట్ అక్టోబర్ 13కి మరెంతో సమయం కూడా లేదు. అప్పటిలోపు సినిమాని పూర్తి చేసి సినిమాని విడుదల చేయగలమా? అంటూ రాజమౌళి టెన్షన్ కి గురి అవుతున్నాడు.

ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ రెండున్నరేళ్ళకు పైగా ఈ సినిమా కోసం పని చేశారు. అదేంటో గాని ఈ సినిమా షూట్ స్టార్ట్ చేయటానికి ప్లాన్ చేస్తోన్న ప్రతిసారి యూనిట్ కి సంబధించిన ఎవరో ఒకరు కరోనా భారిన పడుతున్నారు. లాస్ట్ టైం షూట్ స్టార్ చేసే సమయంలో అలియా భట్ కరోనా బారిన పడింది. అంతకు ముందు సినిమా ప్రొడక్షన్ టీంలో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో అప్పుడు షూటింగ్ ఆపారు. దానికంటే ముందు రాజమౌళి ఫ్యామిలీకే కరోనా వచ్చింది. అప్పుడు షూట్ అప్పారు. ఆ తర్వాత చరణ్ కి కరోనా రావడంతో షూట్ ఆపారు.

సంబంధిత సమాచారం :