కేటీఆర్‌కు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ రిక్వెస్ట్

Published on May 13, 2021 11:57 pm IST

కరోనా సెకండ్ వేవ్ ధాటికి చిత్ర పరిశ్రమ మరోసారి మూతబడింది. బడా స్టార్లు చాలామంది వైరస్ బారిన పడ్డారు. దాదాపు అన్ని సినిమాల చిత్రీకరణలు నిలిచిపోయాయి. పూర్తైన సినిమాల విడుదలలు వాయిదాపడ్డాయి. ఇలాంటి టైంలో కూడ సినీ బృందాలు ప్రజల కోసం తమవంతు కృషి చేస్తున్నాయి. కరోనాతో ఇబ్బందిపడుతున్న వారికోసం ఆసుపత్రులు, ఆక్సిజన్ సిలిండర్లు, పడకలు, ఇంజక్షన్లు లాంటి కీలక సమాచారాన్ని సేకరించి సోషల్ మీడియాలో ఉంచుతున్నారు. ఎవరైనా పలానా ఇన్ఫర్మేషన్ కావాలని అడిగితే నిముషాల్లో ఎంక్వైరీ చేసి సహాయపడుతున్నారు.

ఇక ఆక్సిజన్ సిలిండర్లు, రేమిడిసివర్ ఇంజెక్షన్లకు ఏర్పడిన డిమాండ్ దృష్ట్యా బ్లాక్ మార్కెట్ పెరిగిపోయింది. కొందరు కావాలనే వాటిని బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తూ దోచుకుంటున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఈ బ్లాక్ మార్కెట్ దందాను భరించలేక అష్టకష్టాలు పడుతున్నారు. ఈ విషయాన్నే ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లింది. ఈరోజు కేటీఆర్ సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చారు. ఈ సంధర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఈ బ్లాక్ మార్కెట్ దందాను కంట్రోల్ చేయమని, ప్రభుత్వం నుండే అధికారిక ధరకు ఆక్సిజన్ సిలిండర్లు, ఇంజెక్షన్లు అందే ఏర్పాట్లు చేయమని రిక్వెస్ట్ చేశారు. కేటీఆర్ సైతం వెంటనే స్పందించి సంతృప్తికరమైన సమాధానం ఇచ్చారు.

సంబంధిత సమాచారం :