ఇప్పుడు మన దక్షిణాది నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ వండర్ “రౌద్రం రణం రుధిరం”. దేశ వ్యాప్తంగా ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని రాజమౌళి నెవర్ బిఫోర్ యాక్షన్ సీక్వెన్స్ లతో ప్లాన్ చేస్తున్నారు.
అందుకు తగ్గట్టుగానే తన ఇద్దరు హీరోలతో రాజమౌళి రేయింబవళ్లు కష్టపడి అదిరిపోయే సీన్స్ ను తెరకెక్కిస్తున్నారని విన్నాము. అయితే పర్టిక్యులర్ గా ఒక్క ఎనిమిది నిమిషాల సీక్వెన్స్ కోసం మాత్రమే మేకర్స్ 50 రోజులకు పైగా కష్టపడినట్టు తెలుస్తుంది.
హైదరాబాద్ లో ప్లాన్ చేసిన ఈ సీన్ సినిమాలో మంచి పవర్ ప్యాకెడ్ గా ఉంటుంది అని టాక్. బాలీవుడ్ స్టార్ నటులు అజయ్ దేవగన్ అలాగే ఆలియా భట్ లు నటిస్తున్న ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.


