RRR: కనువిందు చేస్తున్న జక్కన్న టీం..!

Published on Aug 20, 2021 11:00 pm IST

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఈ క్రేజీ మల్టీ స్టారర్‌పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇటీవలే ఉక్రెయిన్‌లో కీలక కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది చిత్ర బృందం. అయితే అక్కడ షెడ్యూల్ పూర్తి చేసుకున్నాక టీం అంతా కలిసి సంబరాలు చేసుకుంది. ఈ సందర్భంగా తీసిన ఓ వీడియోను తాజాగా చిత్ర బృందం ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

అయితే దాదాపు వంద మంది బృందంతో జక్కన మధ్యలో కూర్చుని ఉన్న ఈ వీడియో నెటిజన్లను కనువిందు చేస్తుంది. ఇకపోతే అక్టోబర్ 13న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించగా ఇప్పుడు ఈ రిలీజ్ డేట్‌పై సందిగ్ధత నెలకొంది. ఈ సినిమా రిలీజ్‌ను వచ్చే ఏడాదికి షిఫ్ట్ చేశారని, త్వరలోనే ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించబోతుందంటూ ప్రచారం జరుగుతుంది.

సంబంధిత సమాచారం :