మెగా ఫైరింగ్ అప్డేట్ ఈరోజే అంటున్న “RRR” టీం.!

Published on Mar 20, 2021 1:04 pm IST

సెన్సేషనల్ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” నుంచి అల్లూరి సీతారామ రాజు గా చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై మేకర్స్ ఓ అప్డేట్ ను ఇవ్వనున్నారని ఈరోజు ఉదయం తెలిపిన సంగతి తెలిసిందే. మరి చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ సాలిడ్ అప్డేట్ ఆల్రెడీ ప్లాన్ చేసి ఉందని కూడా తెలిసింది.

కాకపోతే అది ఎపుడు వస్తుంది ఏమిటి అన్నది ఇంకా ఎలాంటి అప్డేట్ చిత్ర యూనిట్ నుంచి రాలేదు. మరి మొత్తానికి మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉండే “RRR” యూనిట్ ఆ అప్డేట్ పై హింట్ ఇచ్చారు. చరణ్ బర్త్ డే అప్డేట్ కోసం ఈరోజే అనౌన్స్ చెయ్యనున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. మరి ఆ అప్డేట్ ఏంటి అన్నది తెలియాలి అంటే ఇంకాసేపు ఆగక తప్పదు.

ఇప్పటికే ఈ అప్డేట్ కోసం మెగా ఫాన్స్ మరియు చరణ్ అభిమానులు గట్టిగా ఎదురు చూస్తున్నారు. మరి మేకర్స్ ఏం చెప్పనున్నారో చూడాలి. యంగ్ టైగర్ మరో పవర్ ఫుల్ పాత్రలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం వచ్చే ఆక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :