“ఆర్ఆర్ఆర్” ట్రైలర్‌ కొత్త రిలీజ్‌ డేట్‌ ఫిక్స్..!

“ఆర్ఆర్ఆర్” ట్రైలర్‌ కొత్త రిలీజ్‌ డేట్‌ ఫిక్స్..!

Published on Dec 4, 2021 7:16 PM IST


టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా జోరుగానే చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఈ సినిమా ట్రైలర్‌ని డిసెంబర్‌ 3న విడుదల చేస్తామని తొలుత ప్రకటించినప్పటికీ అనుకోని కారణాల వల్ల అది వాయిదాపడింది. అయితే తాజాగా ట్రైలర్‌ను డిసెంబరు 9వ తేదిన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు