జక్కన్నపై “RRR” యూనిట్ కంప్లైంట్స్..తారక్, చరణ్ లవి ఏంటి మరి?

Published on Oct 10, 2020 3:48 pm IST

ఈరోజు దర్శక ధీరుడు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా అనేక మంది సినీ తారలు అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. కానీ ఇదే రోజున రాజమౌళి చేస్తున్న “RRR” సినిమా యూనిట్టే రాజమౌళిపై కంప్లైంట్స్ చేస్తూ ఊహించని షాకిచ్చారు. ఒక్కో టెక్నిషియన్స్ ఒక్కో కంప్లైంట్ రైజ్ చేస్తూ రాజమౌళితో తమ ఇబ్బందులను తెలిపారు. అలా జక్కన్న ఆస్థాన సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి అయితే పాటల విషయంలో రాజమౌళితో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో తెలిపారు.

పల్లవి ఒక నెలలో అయితే చరణం ఇంకో మూడు నెలల్లో అయితే రికార్డింగ్ కు ఆ తర్వాత ఏడాది అంటాడని తీరా అప్పటికి ఆ పాట ఏ సినిమాలోది ఎందుకు చేసాం అన్ని మర్చిపోతాం అని కీరవాణి కంప్లైంట్ చేసారు. ఇక రామ్ చరణ్ మరియు తారక్ ల విషయానికి వస్తే వీళ్ళ బాధ ఇంకెవరికి చెప్పుకోవాలి ఆ రేంజ్ లో ఉన్నాయట. తారక్ తో అయితే సరిగ్గా కష్టమైన షాట్ ఏం లేదు వెళ్ళిపోదాం అనే సరికి సరిగ్గా అదే టైం కి ఒక షాట్ చెప్తాడు.

అది రీటేక్ లు చేయించి చేయించి ఒక్క షాట్ ని మూడు గంటలు చేయిస్తాడని ఊరికినే అనలేదుగా జక్కన అని చెక్కి చెక్కి అలా తీసుకొస్తాడని ఒకసారి అయితే ప్యాకప్ చెప్పడానికి తెల్లారుజాము 4:30 కు చెప్పాడని కంప్లైట్ చేసాడు. ఇక చరణ్ వంతుకు వస్తే ఒక RRR షూట్ కి ఒక యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ టైం కి వెళ్లి గుడ్ మార్నింగ్ చెప్తూ దూరంగా ఒక 40 అడుగులు నుంచి రోల్ అవుతూ కిందకి పడే అదిరిపోయే షాట్ చూపిస్తారు.

తీరా అది ఎవరు చేస్తారు అని అడిగితే ఇంకెవరు చేస్తారు చరణ్ నువ్వే అని లాప్టాప్ ఓ చూపించి ఏదొకలా చేయించేస్తాడని చరణ్ కంప్లైట్ చేశారు. వీళ్లంతా ఏదోకటి చెప్పారు కానీ నిర్మాత డివివి దానయ్యకు మాత్రం రాజమౌళితో అసలు ఎలాంటి కంప్లైంట్స్ లేవని క్లారిటీ ఇచ్చేసారు. అయితే ఇదంతా వారు రాజమౌళిపై నిజంగానే కంప్లైంట్ చేసింది కాదు కేవలం ఈ బర్త్ డే కు వారు ఇచ్చిన డిఫరెంట్ గిఫ్ట్ మాత్రమే..

వీడియో కోసం క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :