గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. కాగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన అద్భుతమైన ప్రస్థానాన్ని ఇంకా కొనసాగిస్తోంది. రెండవ ఆదివారం నాటికి, ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా రూ. 393 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, రూ. 400 కోట్ల మైలురాయిని దాటే దశకు చేరుకుంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రంగా ఇది ఇప్పటికే నిలిచింది.
ఇకపై ఈ చిత్రం తన వసూళ్లను ఎంతవరకు పెంచుకుంటుంది ?, ఎలాంటి కొత్త రికార్డులను సృష్టిస్తుందో వేచి చూడాలి. ఎలాగూ చిత్ర బృందం బుధవారం నుంచి కొత్త సన్నివేశాలను జోడించనుంది, దీనివల్ల రాబోయే రోజుల్లో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ పెద్దిలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు.
అన్నట్టు ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ సంస్థ రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించింది. వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ తదితరలు కీలక పాత్రలు పోషించారు.



