అన్నపూర్ణలో శరవేగంగా ‘రుద్రమదేవి’ షూటింగ్

అన్నపూర్ణలో శరవేగంగా ‘రుద్రమదేవి’ షూటింగ్

Published on Jun 29, 2014 10:11 AM IST

Rudhramadevi

టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న హిస్టారికల్ 3డి సినిమా ‘రుద్రమదేవి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ఓ సెట్ లో జరుగుతోంది. ఈ సినిమాలో నటిస్తున్న స్టార్ నటీనటులంతా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అలాగే అనుష్క – రానాలపై కూడా కొన్ని సన్నివేశాలను గుణశేఖర్ షూట్ చేస్తున్నాడు.

గుణశేఖర్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్, భారీ సెట్స్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాని ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేయడానికి ఈ చిత్ర టీం శరవేగంగా షూటింగ్ ని ఫినిష్ చేస్తున్నారు. ఇండియాలోనే మొట్టమొదటి సారిగా 3డిలో తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ సినిమా ఇది. అనుష్క, రానా, నిత్యా మీనన్, కేథరిన్ ట్రేస, కృష్ణంరాజు, హంసా నందిని తదితరులు నటిస్తున్న ఈ మొవిఎని గుణశేఖర్ తన స్వీయ నిర్మాణంలో నిర్మిస్తుండగా, మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు