
భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దాదాపు 9 సంవత్సరాలు రీసర్చ్ చేసి తెరకెక్కించిన పీరియాడికల్ సినిమా ‘రుద్రమదేవి’. ఇండియాలోనే మొట్టమొదటి సారిగా గుణశేఖర్ స్టీరియో స్కోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్న హిస్టారికల్ 3డి మూవీ ‘రుద్రమదేవి’. గత సంవత్సరం డిసెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఓ శుభవార్త.
ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు చెబుతున్న సమాచారం ప్రకారం రుద్రమదేవి ఆడియోని ఫిబ్రవరి 17న రిలీజ్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అలాగే సినిమాని కూడా సమ్మర్ మొదట్లో మార్చి 27న రిలీజ్ చెయ్యాలని గుణశేఖర్ టీం ట్రై చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అనుష్క, రానా ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.