‘రుద్రమదేవి’ థియేటర్లకు వచ్చేసింది..!

‘రుద్రమదేవి’ థియేటర్లకు వచ్చేసింది..!

Published on Oct 9, 2015 12:00 PM IST

Rudhramadevi

తెలుగు సినీ అభిమాని ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. గుణశేఖర్ ఏళ్ళనాటి కలల ప్రాజెక్ట్‌గా రూపొంది మూడు సంవత్సరాల కష్టం తర్వాత నేడు ప్రపంచవ్యాప్తంగా రుద్రమదేవి సినిమా విడుదలైంది. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూసిన అభిమానులంతా సంబరాల్లో మునిగిపోయారు. నిన్న అర్థరాత్రి నుంచే సినిమా సందడి మొదలవ్వగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోతో రుద్రమదేవి హంగామా ఊపందుకుంది.

ఇప్పటికే పలు చోట్ల ప్రదర్శితమైన ఈ సినిమాకు అభిమానుల దగ్గర్నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. ముఖ్యంగా గోన గన్నారెడ్డిగా నటించిన అల్లు అర్జున్, రుద్రమదేవిగా నటించిన అనుష్కల నటనకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక సంవత్సరం కాలంగా విడుదల విషయంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చివరకు సినిమా భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేయడంతో సినిమా యూనిట్ సంతోషంగా ఉంది. అల్లు అర్జున్ ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ఇలాంటి సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉందని తెలిపారు. గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ఈ సినిమా సుమారు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొంది తెలుగు, హిందీ, మళయాల భాషల్లో ఒకేసారి విడుదలైంది.

తాజా వార్తలు