జూలై చివర్లో ‘రుద్రమదేవి’ రిలీజ్

జూలై చివర్లో ‘రుద్రమదేవి’ రిలీజ్

Published on Jun 22, 2015 2:58 PM IST

Rudhramadevi

టాలీవుడ్ లో వస్తున్న భారీ బడ్జెట్ పీరియాడికల్ ఫిల్మ్స్ లో గుణశేఖర్ తెరకెక్కించిన ‘రుద్రమదేవి’ ఒకటి. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఎక్కువ టైం తీసుకుంటున్న కారణంగా ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. జూన్ 26న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఈ చిత్ర సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం రుద్రమదేవి సినిమాని జూలై చివరి వారంలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎక్కువ భాగం జూలై 30న ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

భారీ చిత్రాల డైరెక్టర్ గుణశేఖర్ డ్రీం ప్రాజెక్ట్ అయిన ఈ ‘రుద్రమదేవి’లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అనిపించుకున్న యోగ బ్యూటీ అనుష్క రుద్రమదేవి పాత్రలో కనిపించనుంది. రుద్రమదేవి కథలో కీలకమైన గోనగన్నా రెడ్డి పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.

తాజా వార్తలు