స్పష్టత లేని రుద్రమదేవి విడుదల తేది

స్పష్టత లేని రుద్రమదేవి విడుదల తేది

Published on Jun 2, 2015 10:13 AM IST

rudhramadevi-(1)
‘రుద్రమదేవి’ చిత్ర బృందం తమ సినిమా విడుదల తేదిపై ఇంకా స్పష్టత లేకుండా వ్యవహరిస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవికి విడుదలచేద్దాం అనుకున్నా అది కార్యరూపం దాల్చలేదు.

ఇప్పుడు ఈ సినిమాను జూన్ లో గానీ జులైలో గానీ మన ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘బాహుబలి’ జులైలో వస్తుందని ప్రకటించడంతో రుద్రమదేవిని అంతకంటే ముందు దింపాలని ఆలోచిస్తున్నారట. ఇంకా ఫైనాన్షియల్ సమస్యలు వుండడంతో విడుదలతేదిపై స్పష్టత లేదు.

గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాలో అనుష్క ప్రధానపాత్ర పోషించింది.

తాజా వార్తలు