నేడే ‘రుద్రమదేవి’ తమిళ వర్షన్ రిలీజ్

నేడే ‘రుద్రమదేవి’ తమిళ వర్షన్ రిలీజ్

Published on Oct 16, 2015 7:10 AM IST

Rudhramadevi
గుణశేఖర్ కలల ప్రాజెక్ట్ అయిన రుద్రమదేవి సినిమా ఎన్నో అవాంతరాలను దాటుకొని అక్టోబర్ 9న తెలుగు, హిందీ, మళయాలం భాషల్లో భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. కాకతీయ సామ్రాజ్య వీరనారి రాణీ రుద్రమదేవి కథ కావడం, భారతదేశపు మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ 3డీ సినిమా కావడం అనుష్క, అల్లు అర్జున్, రానా లాంటి భారీ తారాగణం నటించడం వంటి కారణాలతో సినిమాపై మొదట్నుంచీ విపరీతమైన అంచనాలు కనిపించాయి.

ఇక ఈ సినిమాపై ఇతర భాషల్లో కూడా ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని తెలుగుతో పాటు హిందీ, మళయాలంలోనూ సినిమాను విడుదల చేశారు. కాగా తమిళంలో మాత్రం ఈ సినిమా ఒకవారం ఆలస్యంగా అంటే అక్టోబర్ 16న విడుదల చేయాలని థెండాల్ ఫిల్మ్స్ ముందే ప్లాన్ చేసుకుంది. ఈ నేపథ్యంలో ఒకవారం ఆలస్యంగా తమిళనాట నేడు రుద్రమదేవి సినిమా తమిళ వర్షన్ పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైంది. సుమారు 350కి పైగా స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. తెలుగు సినిమాకు తమిళంలో మంచి రెస్పాన్స్ కనిపిస్తోన్న పరిస్థితుల్లో వస్తోన్న సినిమా కావడంతో రుద్రమదేవిపై సాధారణంగానే తమిళనాట మంచి అంచనాలున్నాయి.

తాజా వార్తలు