‘రుద్రమదేవి’ 3డి థియేట్రికల్ ట్రైలర్ విడుదలకు అంతా రెడీ.

‘రుద్రమదేవి’ 3డి థియేట్రికల్ ట్రైలర్ విడుదలకు అంతా రెడీ.

Published on Feb 27, 2015 2:20 PM IST

rudrama-devi-theatrical-tra
‘రుద్రమదేవి’ 3డి థియేట్రికల్ ట్రైలర్ విడుదలకు రంగం సిద్దమయింది. ఫిబ్రవరి 28, శనివారం నాడు ప్రసాద్ ఐమాక్స్ థియేటర్లో ఈ విడుదల కార్యక్రమం ఉంటుంది. 7.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు, చిత్ర బృందం హాజరుకానున్నారు. ఇండియాలో తెరకెక్కిన ఫస్ట్ హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి సినిమా మన తెలుగు కావడం అందరికి గర్వకారణం.

13వ శతాబ్దానికి చెందిన కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి జీవితకథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో అనుష్క టైటిల్ రోల్ పోషిస్తుంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చాళుక్య వీరబద్రుడి పాత్రలో దగ్గుబాటి రానా, గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటించారు.

శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ టీం వర్క్స్ పతాకంపై గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కృష్ణం రాజు, సుమన్, ప్రకాశ్‌ రాజ్, నిత్యా మీనన్, క్యాథరిన్, ప్రభు తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. మేస్ట్రో ఇళయరాజా ఈ చారిత్రాత్మక చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

తాజా వార్తలు