యూఎస్‌లో 1 మిలియన్ కొట్టిన ‘రుద్రమదేవి’

rudramadevi
దర్శకుడు గుణ శేఖర్ ఏళ్ళ పాటు శ్రమించి, తన కలల ప్రాజెక్టుగా తెరకెక్కించిన సినిమా ‘రుద్రమదేవి’. ఒక చారిత్రక కథాంశంతో రూపొందిన సినిమా కావడంతో ‘రుద్రమదేవి’కి మొదట్నుంచే విపరీతమైన క్రేజ్ కనిపించింది. ఆ క్రేజ్ నేపథ్యంలోనే దసరా సీజన్‌లో ఈ సినిమా మంచి కలెక్షన్లను వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. అనుష్క, అల్లు అర్జున్, రానా, నిత్యా మీనన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను గుణశేఖర్ స్వయంగా నిర్మించారు. నైజాంలో సూపర్ కలెక్షన్స్ సాధించిన ‘రుద్రమదేవి’ సినిమా, ఇతర ప్రాంతాల్లోనూ అదేస్థాయి కలెక్షన్స్ సాధించింది.

ఇక తెలుగు సినిమాకు ఈ మధ్యకాలంలో మంచి మార్కెట్‌గా అవతరించిన యూఎస్ బాక్సాఫీస్ వద్ద ‘రుద్రమదేవి’ సినిమా, డ్రీమ్ మార్క్ అయిన 1 మిలియన్ డాలర్స్‌ను కొల్లగొట్టింది. అయితే ఒక్క తెలుగు వర్షన్‌తోనే రుద్రమదేవి ఈ ఫీట్‌ను సాధించలేకపోయింది. రుద్రమదేవి తెలుగు వర్షన్ ఇప్పటివరకూ 972కే డాలర్లను వసూలు చేయగా, మిగతా మొత్తం తమిళ వర్షన్ ద్వారా సాధించి 1 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇక గుణశేఖర్ ఎంతో కష్టపడి తెరకెక్కించిన సినిమా చివరికి సేఫ్ ప్రాజెక్ట్ అనిపించుకోవడం ఆహ్వానించదగ్గ విషంగానే చెప్పుకోవచ్చు.

Exit mobile version